ఈ కలియుగంలో కలి ప్రభావం చేత, జనులు అధర్మమార్గాన్ని అనుసరించి, తెలిసో తెలియకో చేసిన తప్పులకు, ప్రమాదాల రూపంలో, అనారోగ్యాలచే, ప్రకృతి వైపరీత్యాల ద్వారా అకాలమరణం సంభవిస్తుంది.
అకాల మృత్యువు తొలగి పూర్ణాయుష్షును పొందుటకు శ్రీ మార్కండేయ స్వామి వారు చూపిన భక్తి మార్గములో అనుసరిద్దాం..
అల్పాయుష్కులైన శ్రీ మార్కండేయ స్వామి వారు శ్రీ దేవీ ఉపాసనా శక్తితో, శ్రీ మృత్యుంజయేశ్వరస్వామిని ప్రసన్నం చేసుకుని, అపమృత్యువు తొలగించుకుని పూర్ణాయుష్కునిగా చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచి, ఎన్నో మన్వంతరాలు చూస్తూ తన తపః శక్తిని లోకకళ్యాణం కొరకు అందిస్తున్నారు.
మనం అందరం ఆ మార్కండేయ స్వామి వారు అనుసరించిన మార్గములో పరిపూర్ణమైన భక్తితో అనుసరించి మృత్యుంజయేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని పూర్ణాయుస్సుని పొందుదాం.