About
అధర్మము పెరిగినప్పుడు మానవులు యాజ్ఞ యాగాలు చేసి భగవంతుని పిలిచినప్పుడు భగవంతుడు అవతారము దాల్చి ధర్మము నిలిపి అవతారము చాలిస్తారు. మానవులు భగవంతుని మించిన వారము మాకు అన్ని తెలుసు అని భగవంతుడినే విస్మరించండం వలన కలియుగం ప్రారంభమైంది. ఈకలియుగము నందు ధర్మము ఒంటి పాదము మీద నడుస్తుంది పూర్తిగా ధర్మము నసిస్తే ప్రళయం వచ్చి కలియుగం అంతమైపోతుంది. అధర్మము నుండి కలిపురుషుడు పుట్టుకొచ్చి మానవుల్లో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మశ్చర్యాలు ప్రలోభపరచి యమశిక్షకు గురిచేసి, ప్రమాదాల ద్వార, అనారోగ్యాల కారణంగా, ప్రకృతి వైపరీత్యాల వలన ఆయుష్షును హరింపజేస్తున్నాడు.
అల్ఫాయుష్కునిగా జన్మించిన శ్రీ మార్కండేయ మహర్షి వారు శ్రీ దేవీ పరాశక్తి ఉపాసనతో శక్తిని పొంది శ్రీ మృత్యుంజయేశ్వరుడుని ప్రసన్నం చేసుకుని శ్రీ యమధర్మరాజుని ద్వారా మరణం లేకుండా వరం పొందటమే కాకుండా భక్తి ప్రపత్తులతో చిరంజీవిగా దీర్ఘాయువు పొంది చిరంజీవిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.
శ్రీ మార్కండేయ స్వామి వారు అనుసరించిన భక్తి మార్గములో మనం అందరం పరిపూర్ణమైన భక్తితో అనుసరించి మృత్యుంజయేశ్వర స్వామి ఆశీస్సులు పొంది సంపూర్ణాయుష్షుని పోందుదాం..
ప్రతి మంగళవారం శుక్రవారం శ్రీ దేవీ పరాశక్తి శ్రీచక్ర కుంకుమార్చన జరుగును.
ప్రతి రోజూ ప్రదోష కాలంలో అభిషేకం జరుగును
ప్రతి మాస సంక్రాంతి రోజన చిత్రగుప్తుని వ్రతం శ్రీ యమధర్మరాజుల వారికి తైలాభిషేకం జరుగును.
ప్రతి గురువారం ప్రత్యేక పూజ జరుగును, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి శ్రీ మార్కండేయ మృత్యుంజయ హోమం జరుగును..
Wednesday
శ్రీ క్రోధి నామ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నాడు లక్ష రుద్రాక్షలతో మహాశివలింగం రూపొందించి లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం జరుగును.
కార్యక్రమం జరుగు స్థలం: ఆంజనేయ కాలనీ, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522 503
మీ శక్తానుసారం రుద్రాక్షలు అందించి రుద్రాభిషేకం జరిగిన తరువాత ఎన్ని రుద్రాక్షలు అందిస్తే అన్నీ స్వీకరించగలరు. క్రింది లింక్ పై క్లిక్ చేసి మీరు ఎన్ని రుద్రాక్షలు ఇవ్వగలరో ఎంచుకుని, గోత్ర నామాలు నమోదు చేయగలరు.
Join Nowమార్కండేయ
శ్రీ క్రోధి నామ సంవత్సరం, మాఘమాసం, బహుళ త్రయోదశి లక్ష రుద్రాక్షలతో మహాశివలింగం చేసి మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం జరుగును.
ప్రతి మంగళవారం శుక్రవారం లోక జనని శ్రీ దేవీ పరాశక్తి, శ్రీచక్ర కుంకుమార్చన జరుగును. ఈ కుంకుమార్చనలో పాల్గొనడం వలన శత్రుభయం తొలగి, మంగళ సౌభాగ్యము కలిగి, మనం చేయవలసిన పనులకు ధైర్యం శక్తి లభిస్తుంది.
శ్రీ మార్కండేయ స్వామి పీఠం నందు నిత్యం ప్రదోష సమయంలో శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారికి అభిషేకం జరుగును. ఈ అభిషేకంలో పాల్గొనడం వలస సకలదేవతల అనుగ్రహాన్ని పొందుతారు.